టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తులో భాగంగా జనసేనకు తక్కువ సీట్లు కేటాయించడంపై మంత్రి గుడివాడ అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ ను అమాయకుడిని చేసి సీట్లు తగ్గించారని ఆయన అన్నారు.
పవన్ కళ్యాణ్ కనీసం తన అన్నకు కూడా సీటు ఇచ్చుకోలేకపోయాడని ఎద్దేవా చేశారు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు ఉన్న విలువ పవన్ కళ్యాణ్ కు లేదని సెటైర్ వేశారు.