రాయలసీమవాసులకు రైల్వేశాఖ శుభవార్త చెప్పింది. కోయంబత్తూరు నుంచి కడప మీదుగా ప్రత్యేక రైలు నడుస్తున్నట్లు తెలిపారు. కోయంబత్తూరు నుంచి భగత్‌కీకోటీ (06181) రైలు ఈ నెల 14, 21, 28 ఏప్రిల్ 4 తేదీ వరకు అలాగే.. భగత్‌కీకోటి నుంచి కోయంబత్తూరుకు (06182) రైలు ఈ నెల 17, 24, 31, ఏప్రిల్ 7న నడనున్నట్లు చెప్పారు. కోయంబత్తూరులో ప్రతి గురువారం అర్ధరాత్రి 2.30గంటలకు బయల్దేరి కడపకు అదేరోజు మధ్యాహ్నం 1.55గంటలకు చేరుకుంటుంది. అలాగే ఎర్రగుంట్ల 2.30కి వస్తుంది.
ఈ రైలు ఎర్రగుంట్ల నుంచి గుత్తి, డోన్‌మీదుగా కాచిగూడ, నాందేడ్, అహ్మదాబాద్ మీదుగా భగత్‌కీకోటి రైల్వేస్టేషన్ చేరుకుంటుందని తెలిపారు. తిరుగు ప్రయాణంలో భగత్‌కీకోటి నుంచి ప్రతి ఆదివారం సాయంత్రం 7.30కు బయల్దేరి మంగళవారం సాయంత్రం 5.25గంటలకు ఎర్రగుంట్లకు 6గంటలకు కడప రైల్వేస్టేషన్‌కు చేరుకుంటుందని తెలిపారు. అక్కడ నుంచి కోయంబత్తూరుకు బుధవారం ఉదయం 9.30గంటలకు వెళుతుందన్నారు. ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.