ఒకే దేశం-ఒకే ఎన్నిక నినాదంతో జమిలి ఎన్నికల నిర్వహణపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ గురువారం తమ నివేదికను రాష్ట్రపతి ద్రౌపదీముర్ముకు సమర్పించే అవకాశాలున్నాయి.
లోక్‌సభ, శాసనసభ, స్థానిక సంస్థల ఎన్నికలు ఏకకాలంలో నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం 5 అధికరణలను సవరించాలని కమిటీ సూచించనున్నట్లు తెలుస్తోంది. మూడుస్థాయిల ఎన్నికలకు ఉమ్మడిగా ఓటర్ల జాబితా ఉండాలని నివేదిక సూచించనుంది.