కేరళలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయబోమని సీఎం పినరయి విజయన్ మరోసారి స్పష్టం చేశారు. సీఏఏపై కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీల 'ఇండియా' కూటమిలో తమ పార్టీ కాంగ్రెస్‌కు మిత్రపక్షమని ఆయన అన్నారు. అయితే ఈ అంశంపై రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే ఇంకా మాట్లాడలేదని విజయన్ విమర్శించారు. సీఏఏకు వ్యతిరేకంగా ఐక్య ఫ్రంట్ నుంచి కాంగ్రెస్ వైదొలిగిందని విజయన్ ఆరోపించారు.