నల్లచెరువు మండలం బాలేపల్లి తాండా కు చెందిన వైఎస్సార్సిపి పార్టీ నాయకులు ఆంజినప్ప నాయక్ రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న కదిరి ఎమ్మెల్యే డాక్టర్ పివి సిద్ధారెడ్డి సోమవారం ఆసుపత్రికి వెళ్లి పరామర్శించారు. ఒక డాక్టర్ గా ఆంజినప్పకు ధైర్యం చెబుతూ తగు సూచనలు అందజేశారు. ఎమ్మెల్యేతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలు పరామర్శించారు.