చిత్తూరు జిల్లాలో 33 మంది వాలంటీర్లను అధికారులు తొలగించారు. చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురిని అధికారులు విధుల నుంచి బహిష్కరించారు.
ప్రభుత్వ యంత్రాంగం అప్పగించిన పనులను సక్రమంగా నిర్వర్తించలేదనే కారణంతో వాలంటీర్లను తొలగించినట్లు అధికారులు తెలిపారు. కాగా, ఎన్నికల సమయంలో వాలంటీర్ల తొలగింపు వివాదాస్పదంగా మారింది.