అనంతపురం జిల్లా పెద్దముస్తూర్లో సోమవారం దారుణం చోటు చేసుకుంది. భర్త ఓబులేసు వేధింపులు భరించలేక భార్య గొడ్డలితో అతడిపై దాడి చేసింది. దాంతో ఓబులేసు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సదరు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.