ఓ కారు డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా బీటెక్ విద్యార్థి దుర్మరణం చెందాడు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. తిరుచానూరు పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి జీవకోన చెందిన సందీప్(21) పుత్తూరులోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నాడు. ఆదివారం పుత్తూరు నుంచి ఇద్దరు స్నేహితులతో కలిసి బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. మార్గమధ్యంలోని దామినేడు సమీపంలో జాతీయ రహదారిపై వస్తుండగా.. ముందు వెళుతున్న కారు సడన్ బ్రేక్ వేసింది. దీంతో ఈ కారును వెనుక నుంచి బైక్ ఢీకొంది. ఈ ప్రమాదంలో సందీ్‌పకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మిగిలిన ఇద్దరికి కూడా గాయాలయ్యాయి. కారు డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడమే ప్రమాదానికి కారణమని సీఐ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. దాంతో కారు డ్రైవర్ని అరెస్టు చేసి, వాహనాన్ని పోలీ్‌సస్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయాస్పత్రికి తరలించగా, సందీప్ తల్లిదండ్రులు అక్కడికొచ్చి బోరున విలపించారు. మిగిలిన ఇద్దరు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పోలీసులు తెలిపారు.