సారత్రిక ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున కలెక్టరెట్లో ప్రతి సోమవారం నిర్వహించనున్న స్పందన కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నటు విశాఖపట్నం కలెక్టర్ డాక్టర్ ఎ.మల్లికార్జున ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నంత వరకు ఈ కార్యక్రమం నిర్వహించడానికి అవకా శం లేదని, జిల్లా వాసులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. కాగా జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించే స్పందన, మొదటి, రెండో సోమవారం నిర్వహించే డయల్ యువర్ మేయర్ కార్యక్రమాలను కూడా రద్దుచేస్తున్నట్టు కమిషనర్ సీఎం సాయికాంత్‌వర్మ తెలిపారు.