ఎన్నికల విధుల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమలుకు సంబంధించి పలువురు సచివాలయ సిబ్బంది విధులకు గైర్హాజరైనందున వారికి షోకాజ్ నోటీసులు జారీచేసినట్లు ఎంపీడీవో కె.విజయ లక్ష్మి తెలిపారు. టెక్కలి పట్టణంలోని ఐదు సచివా లయాల్లో ఎన్నికల విధులకు హాజరు కాలేదని, సచివాలయాల తలుపులు కూడా తెరవలేదని, అందువల్ల ఎన్నికల నిబంధనల మేరకు ఎందుకు చర్యలు తీసుకోకూడదో 24 గంటల్లో సమా ధానం చెప్పాలని ఆ షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు. అలాగే 26 పంచాయతీల్లో కూడా జెండాలు, ప్లెక్సీలు, బ్యానర్లు, ఫొటోలు తొలగించ లేదని, దీంతో ఆయా సచివాలయ సిబ్బంది నిర్లక్ష్యంపైౖ ఎన్నికల అధికారికి నివే దించామన్నారు. ఇదిలా ఉండగా పలు సచివాలయా లను రిటర్నింగ్ అధికారి నూరుల్ కమర్ స్వయంగా పరిశీలించి అసహనం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం 9 గంటల్లోగా పూర్తిస్థాయిలో ప్లెక్సీలు, బ్యానర్లు,తొలగించాలని, లేకుంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.