పల్నాడు జిల్లా, నరసరావుపేట టీడీపీలో టిక్కెట్ రగడ మొదలైంది. నరసరావుపేట అసెంబ్లీ టిక్కెట్‌ను చదలవాడ అరవిందుబాబుకు ఇవ్వాలంటూ నరసరావుపేట మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ పులిమి రామిరెడ్డి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. టిక్కెట్ విషయానికి సంబంధించి బుధవారం రామిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అయితే చదలవాడకు టిక్కెట్ ఇవ్వాల్సిందే అని పట్టుబడుతూ.. విలేకరుల సమావేశంలోనే పులిమిరెడ్డి పురుగుల మందు తాగేశారు. దీంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిన ఆయనను.. బంధువులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం రామారెడ్డికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. అయితే అరవిందుబాబుకి టిక్కెట్ రాకపోతే ఎంపీ లావు కృష్ణదేవరాయలదే పూర్తి బాధ్యత అని మీడియా సమావేశంలో పులిమి రామిరెడ్డి అన్నారు. మరి నరసరావుపేట టీడీపీ టిక్కెట్ వివాదంపై అధినేత చంద్రబాబు స్పందన ఎలా ఉండబోతుందో చూడాలి.