శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం టీడీపీ ఎంపీ అభ్యర్థిగా బి. కె. పార్థసారథి పేరును పార్టీ అధిష్ఠానం శుక్రవారం ప్రకటించింది. ఈ సందర్బంగా పెనుకొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. బి. కె. పార్థసారథి ఉమ్మడి జిల్లా జడ్పీ ఛైర్మన్ గా, హిందూపురం ఎంపీగా, 2సార్లు పెనుకొండ ఎమ్యెల్యేగా గెలుపొందారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు బి. కె. పార్థసారథి కొనసాగుతున్నారు.