రాబోయే లోక్‌సభ ఎన్నికలకు 15 మంది అభ్యర్థులతో కూడిన నాల్గవ జాబితాను బిజెపి శుక్రవారం విడుదల చేసింది. ఈ జాబితాలో తమిళనాడు, పుదుచ్చేరి పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. తమిళనాడులో పొన్ వీ బాలగణపతి తిరువళ్లూరు నుంచి, ఆర్సీ పాల్ కనగరాజ్ చెన్నై (నార్త్), ఏ అశ్వథామన్ తిరువణ్ణామలై నుంచి, కేపీ రామలింగం నామక్కల్ నుంచి, ఏపీ మురుగానందం తిరుప్పూర్ నుంచి పోటీ చేయనున్నారు. పొల్లాచ్చి నుంచి కే వసంతరాజన్, కరూర్ నుంచి వీవీ సెంథిల్నాథన్, చిదంబరం నుంచి కార్త్యాయిని, నాగపట్నం నుంచి ఎస్జీఎం రమేష్, తంజావూరు నుంచి మురుగానందం, శివగంగ నుంచి దేవనాథన్ యాదవ్, మధురై నుంచి రామశ్రీనివాసన్, విరుదునగర్ నుంచి రాధిక శరత్‌కుమార్‌లను పోటీకి దించాలని పార్టీ నిర్ణయించింది. జాబితా ప్రకారం, రాబోయే ఎన్నికలలో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో నమశ్శివాయం ఒక్క స్థానంలో పోటీ చేయనున్నారు. బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం అనంతరం జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ జాబితాను విడుదల చేశారు.