ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై పారదర్శకంగా విచారణ జరిపించాలని జర్మనీ విదేశాంగ శాఖ చేసిన ప్రకటనపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని జర్మన్ రాయబారిని పిలిపించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ..
తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం మంచిది కాదని వార్నింగ్ ఇచ్చింది. నేరం రుజువయ్యే వరకు నిందితుడు నిర్దోషిగా భావించబడడమే చట్టంలోని ప్రాథమిక సూత్రమని, ఇది కేజ్రీవాల్‌కు కూడా వర్తిస్తుందని జర్మనీ ఆగ్రహం వ్యక్తం చేసింది.