ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని మాజీ ఎస్ఈసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు వేశారని చెప్పారు. దేశంలో 35 వేల దొంగ ఓట్లను చేర్చిన ఘనత ఏపీకే దక్కిందని అన్నారు. దొంగ ఓట్లతో గెలిచి భారీ మెజార్టీ వచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకున్నారన్నారు. దొంగ ఓట్లు చేర్చిన వారికి డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని తెలిపారు. తిరుపతిలో జరిగిన దొంగ ఓట్లు వ్యూహరచన ప్రస్తుతo రాష్ట్ర మొత్తం జరిగి ఉంటుందనే అనుమానం కలుగుతుందని అన్నారు. ఓటర్ ప్రొఫైల్ అనేది వలంటరీలు ఎప్పుడో సేకరించి పెట్టారని.. ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. పోలీసులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు ఒక వ్యక్తి వెళ్లారని చంపడం సరికాదని అన్నారు. ఎన్నికల ప్రక్రియకు వలంటీర్లను దూరంగా ఉంచాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు.