ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నగదు తరలింపులపై పోలీసులు దృష్టిసారించారు. రాష్ట్ర వ్యాప్తంగా చెక్‌పోస్టుల వద్ద ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తూ అక్రమంగా తరలిస్తున్న నగదును పట్టుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో చెక్ పోస్టులు వద్ద శనివారం అధికారులు సోదాలు నిర్వహించారు. నిన్న కోటి రూపాయల వరకు నగదు పట్టుబడటంతో కలెక్టర్ ఢిల్లీరావు, సీపీ కాంతిరాణా టాటా ప్రత్యేక దృష్టి సారించారు. ప్రతిరోజూ చెక్‌పోస్టుల వద్ద పనితీరు పరిశీలించాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈరోజు ప్రకాశం బ్యారేజీ వద్ద వాహనాల తనిఖీ తీరును కలెక్టర్, సీపీ పరిశీలించారు.