నిత్య పెళ్లి కొడుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. విజయ్ సాయి రెడ్డి గెలిస్తే నెల్లూరులో ఉండడని వేమిరెడ్డి అన్నారని.. ఈయన విజయసాయి రెడ్డి గురించి మాట్లాడటం సరికాదని తెలిపారు. వైయస్ఆర్ కుటుంబానికి విజయసాయిరెడ్డి అత్యంత సన్నిహితుడు.. కుటుంబ సభ్యుడు అని చెప్పారు. నిజాయితీగా చిత్తశుద్ధిగా ఆ కుటుంబం మీద అభిమానంతో ఇప్పటికీ ఎప్పటికీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడ అడిగినా కూడా వేమిరెడ్డి గురించి చెబుతారు.. రాజకీయ బిక్ష పెట్టిన వైయస్ జగన్ కు వెన్నుపోటు పొడిచి పొగరుతో అహంకారంతో బయటికి వెళ్లారని చెబుతారన్నారు. ఒకప్పుడు నెట్టేసిన చంద్రబాబు దగ్గరికి చేరారు. ఎమ్మెల్యే, మంత్రి కావాలనే ప్రశాంతి రెడ్డి కోరిక కలగానే మిగిలిపోతుందని ప్రసన్న కుమార్ రెడ్డి పేర్కొన్నారు.