చేనేత రంగాన్ని అన్ని విధాలా ఆదుకుని చేనేతకుటుంబాలను అభివృధ్దిలోకి తీసుకువచ్చింది నాడు- వైయస్ రాజశేఖరరెడ్డి అయితే నేడు వైయస్ జగన్ అని శాసనమండలి విప్ లేళ్ళ అప్పిరెడ్డి అని అన్నారు. తాడేపల్లి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో పద్మశాలి ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్యఅతిధిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో చేనేత అభివృధ్దికి తీసుకున్న చర్యలను ప్రతి చేనేత కుటుంబానికి చాటి చెప్పాలని కోరారు.వైయస్ జగన్ సంక్షేమ పధకాలు పొందిన ప్రతి చేనేత కార్మికుడు బ్రాండ్ అంబాసిడర్ గా మారి ప్రచారం చేయాలన్నారు.చేనేత కార్మికుల పిల్లలు నేడు ఇంజనీర్లు,డాక్టర్లుగా మిగిలిన ఉన్నత విద్యకు సంబంధించి పలు కోర్సులు చదవగలుగుతున్నారంటే అందుకు ప్రధాన కారణం నాడు వైయస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయంబర్స్ మెంట్. అదే విధంగా కార్మికుల సమస్యలను అనేకం పరిష్కరించారన్నారు.చేనేత మగ్గాలను ఆదునీకరించేందుకు కూడా సహాయం అందించారన్నారు. చేనేత సహకార సంఘాలను కూడా శక్తివంతం చేశారన్నారు.ఎన్నికలప్పుడు నేతన్నలకు చెప్పిన మాట నెరవేరుస్తూ జగన్ గారు అనేక నిర్ణయాలు తీసుకున్నారన్నారు. మొట్టమొదటిసారిగా 2019లో మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే CM జగన్ గారి పుట్టిన రోజునాడు డిసెంబరు 21 తేదీన వైయస్‌ఆర్ నేతన్ననేస్తం తీసుకొచ్చారని వివరించారు. ఆ రోజు నుంచి వేసిన అడుగు ఈ రోజుకు వరుసగా ఐదో దఫాలతో కలిపి ఈ 50 నెలల కాలంలోనే నేతన్నలకు తోడుగా నిలబడ్డారాన్నారు. నేతన్నలకు అండగా నిలబడుతూ.. వారికి సామాజిక ఫించన్ల రూపంలో రూ.1396 కోట్లు వారి చేతిలో పెట్టారని, నవరత్నాలలోని ఇతర పథకాల ద్వారా మరో రూ.871 కోట్లు వారి చేతిలో పెట్టారు. ఆప్కో బకాయిలు రూ.468 కోట్లు, నేతన్న నేస్తం ద్వారా రూ.970 కోట్లు వెరసి మొత్తంగా రూ.3706 కోట్లు నేతన్నల సంక్షేమం కోసం వెచించరని తెలిపారు.చంద్రబాబు ప్రభుత్వంలో ఐదేళ్లకి కలిపి చేనేతలు కోసం ఇచ్చిన రూ.450 కోట్లు ఎక్కడ ? జగన్ గారి ప్రభుత్వంలో 50 నెలల కాలంలోనే రూ.3706 కోట్లు ఎక్కడా ? ఆలోచన చేయండనీ అప్పిరెడ్డి కోరారు.