ఉత్తర్‌ప్రదేశ్‌లోని మేరఠ్‌లో పెను విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు చిన్నారుల మృతి చెందారు. మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెడుతుండగా షార్ట్‌సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి బెడ్‌షీట్‌కు అంటుకున్నట్లు మృతి చెందిన చిన్నారుల తండ్రి జానీ తెలిపారు.
మృతులను సారిక (10), నిహారిక (8), శంకర్ (6), కలు(4)గా గుర్తించారు. కూలీ పనిచేస్తున్న జానీ ఈ ప్రమాదంలో ప్రాణాపాయం నుంచి బయటపడగా, అతడి భార్య బబిత పరిస్థితి విషమంగా ఉంది.