బీమా పాలసీల సరెండర్ విలువకు సంబంధించి కొత్త నిబంధనలను బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) తీసుకొచ్చింది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
మూడేళ్లలోపు పాలసీలను సరెండర్ చేస్తే.. వాటి విలువ యథాతథంగా లేదా తక్కువగా ఉండే అవకాశముంది. 4-7 సంవత్సరాల మధ్య పాలసీలను సరెండర్ చేస్తే, వాటి విలువ స్వల్పంగా పెరుగుతుంది.