రాజధాని అమరావతి ఉద్యమానికి ఎన్నికల సంఘం ఆదేశాలు పోలీసుల సూచన మేరకు తాత్కాలిక విరామం ప్రకటిస్తున్నట్టు సమన్వయ కమిటీ, అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తెలిపింది. ఈ మేరకు ఓ పత్రికా ప్రకటన విడుదల చేసింది. అమరావతి ఉద్యమకారులకు, మహిళలకు, రైతులకు, రైతు కూలీలకు, దళిత, మైనారిటీ జేఏసీ సభ్యులకు, లీగల్ అండ్ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, శిబిర నిర్వాహకులకు ఈ మేరకు ఐక్య కార్యాచరణ సమితి నుంచి ఆదేశాలు అందాయి. 1560 రోజులుగా ఎన్ని అవాంతరాలు, అణచివేతలు ఎదురైనా అప్రతిహతంగా అమరావతి ఉద్యమం కొనసాగింది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాలు, పోలీసు సూచనల మేరకు బహిరంగ సమిష్టి నిరసన కార్యక్రమాలకు తాత్కాలిక విరామం ప్రకటించారు.