ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీ పార్టీ బీసీ వ్యతిరేక పార్టీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 26, 2024, 11:56 AM

 రాయలసీమలో అబ్దుల్‌ సలాం కుటుంబం ఆత్మహత్య ఘటన మరవకముందే ఒంటిమిట్టలో చేనేత కుటుంబం ఆత్మహత్యకు వైసీపీ నేత అరాచకాలే కారణమని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. ‘జగన్‌ ఆదేశాల మేరకు బడుగు బలహీనవర్గాల ఆస్తులను కాజేస్తున్నారు. ఆత్మహత్యకు కారకులైన దోషులపై డీజీపీ 24 గంటల్లో చర్యలు తీసుకోకపోతే సాక్ష్యాధారాలతో పీఎం, కేంద్ర శాఖలకు ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వం దిగిపోతుందని తెలిసే జగన్‌ రాష్ట్రం మొత్తం మీద బడుగు, బలహీనవర్గాల ఆస్తులను కాజేస్తున్నారు. కడప జిల్లాలో పులివెందులకు కూతవేటు దూరంలో ఉన్న చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకుంటే జగన్‌ ఇంతవరకు ఎందుకు స్పందించలేదు? ఈ ఘటనపై ఎన్నికల కమిషన్‌ జోక్యం చేసుకోవాలి. వైసీపీ కుటుంబం బీసీ వ్యతిరేక కుటుంబం. జగన్‌ తాత కాలం నుంచీ బీసీలను అణిచివేస్తున్నారు. డీజీపీని విధుల నుంచి తొలగించి పార్టీలకు సంబంధం లేని నిజాయితీ పరుడిని డీజీపీగా నియమించాలని ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తున్నాం’ అని బుద్దా వెంకన్న ప్రకటించారు. మాజీ ఎమ్మెల్సీగా ఉన్న తనపైనే రౌడీ షీటర్లపై పెట్టే బైండోవర్‌ కేసులు పెడుతున్నారన్నారు. మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించేందుకు రూ.500 కోట్ల ప్రజాధనాన్ని డంప్‌ చేశారన్నారు. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి అన్ని నియోజకవర్గాలకు సాక్షి వాహనాల్లో పోలీస్‌ ఎస్కార్ట్‌ సహాయంతో డబ్బులు పంపుతున్నారని బుద్దా ఆరోపించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com