ఐదేళ్లు గడపదాటి బయటకు రాని సీఎం జగన్‌కు... ఇప్పుడు బస్సు యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్లే కనీస అర్హత లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.... ‘జగన్ బస్సు యాత్రను క్షమాపణ యాత్రగా మార్చాలి. బస్సు యాత్రకు వెళ్లే ముందు జగన్ ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి. ప్రజల అనుమానాలు, సందేహాలను నివృతి చేయాలి. పాదయాత్రలో, ఎన్నికల మేనిఫెస్టోలో దాదాపు 730కి పైగా హామీలిచ్చారు. ఆ హామీల్లో ఎన్ని నెరవేర్చారో సమాధానం చెప్పాలి. 99 శాతం హామీలు అమలు చేశామంటూ సీఎం హోదాలో అబద్ధాలు చెప్పడం బాధాకరం’ అని వర్ల అన్నారు.