టీడీపీ నాయకత్వం ఇంకా విజయనగరం, కడప, అనంతపురం లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. కడపకు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి పేరు ప్రతిపాదనలో ఉండగా తాజాగా జమ్మలమడుగు ఇన్చార్జి భూపేశ్‌రెడ్డి కూడా తెరపైకి వచ్చారు. అనంతపురం లోక్‌సభ స్థానానికి అంబికా లక్ష్మీనారాయణ, పూల నాగరాజు, ప్రొఫెసర్ రాజేశ్, కంబూరి నాగరాజు పేర్లు పరిశీలనలో ఉన్నాయి. విజయనగరం ఎంపీ స్థానానికి కొందరు నేతలు మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు పేరు ప్రతిపాదించగా.. మరి కొందరు నేతలు విజయనగరం మాజీ ఎమ్మెల్యే మీసాల గీత పేరు ముందుకు తెచ్చారు. ఎచ్చెర్ల నేత కలిశెట్టి అప్పలనాయుడు పేరు కూడా వినిపిస్తోంది.