ఒంగోలు లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థి మారారు. తన కుమారుడు రాఘవరెడ్డి బదులు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డే బరిలోకి దిగనున్నారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసు తీవ్రత పెరగడంతో.. మొదట ఖరారుచేసిన రాఘవరెడ్డిని కాదని.. ఆయన తండ్రి మాగుంట శ్రీనివాసులరెడ్డిని నిలపాలని తాజాగా నిర్ణయించారు. ఈ కేసులో రాఘవరెడ్డి నిందితుడిగా ఉన్నారు. పోటీ నుంచి తప్పుకొంటున్నానని ఆయన సోమవారం బహిరంగంగా ప్రకటించారు.