తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండోరోజు మంగళవారం కుప్పం నియోజవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కేవీఆర్ కల్యాణ మండపం వద్ద టీడీపీలో చేరే వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. అనంతరం కుప్పంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2.30 గంటలకు టీడీపీ కార్యాలయానికి చేరుకుని 3.30 గంటల వరకు పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత రామకుప్పం మండలం రాజుపేట గ్రామం వద్ద హంద్రీ-నీవా కాలువను సాయంత్రం 4.30 నుంచి 5.30 గంటల వరకు పరిశీలిస్తారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు రెండో రోజు పర్యటన బిజి బిజీగా సాగుతోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa