ఎన్నికల నేపథ్యంలో గాజువాక పరిధిలోని అగనంపూడి టోల్‌గేటు వద్ద ఏర్పాటు చేసిన చెక్‌పోస్టు వద్ద మంగళవారం ప్లైయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో రూ. 3, 92, 500 నగదు లభ్యమైంది. తుని నుంచి విశాఖకు కారులో వస్తున్న కోరుకొండ ఈశ్వర్ గణేశ్, సూరంపూడి చంద్రశేఖర్‌ల వద్ద ఈ నగదు లభ్యమైంది. ఇందుకు సంబంధించిన పత్రాలు ఉన్నప్పటికీ వారి నుంచి సరైన సమాధానం లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు.