మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులకు గత ఏడాది జూన్ 20న పాప జన్మించిన విషయం తెలిసిందే. పాపకు మెగా ఫ్యామిలీ క్లీంకార గా నామకరణం చేసింది. అయితే క్లీంకార జన్మించి 9 నెలలు గడుస్తున్నా కూడా పాప ఫేస్ మాత్రం మెగా ఫ్యామిలీ రివీల్ కానివ్వలేదు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ దంపతులు, కూతురు క్లీంకారతో కలిసి వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గుడిలోకి చెర్రీ దంపతులు వెళుతుండగా.. క్లీంకార ఫేస్ కాస్త రివీల్ అయ్యింది. క్లీంకార చాలా క్యూట్‌గా ఉంది. గుండ్రటి మొహం.. పెద్ద కళ్లుతో అందానికి ఐకాన్‌లా ఉందా చిన్నారి. తల్లి ఉపాసన పొదిమి పట్టుకుంటే.. క్యూట్‌గా చూస్తున్న క్లీంకార ఫేస్ చూపరులను కట్టిపడేస్తోంది.