వాతావరణ మార్పుల కారణంగా మార్చిలోనే గరిష్ట స్థాయిలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్నాయి. శనివారం రాష్ట్రంలోని 50 మండలాలు, ఆదివారం 56 మండలాల్లో వేడిగాలులతో కూడిన ఎండలు ఉండనున్నాయని విపత్తు నిర్వహణ సంస్థ సూచించింది. పార్వతీపురం మన్యం, ఎన్టీఆర్, పల్నాడు, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో వడగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఆయా మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది.