సెల్‌ఫోన్ దుకాణం షట్టర్ పగులకొట్టి సమారు రూ.25లక్షల విలువైన సొత్తును దొం గలు అపహరించుకెళ్లారు. ఈ ఘటన ఒంగోలు నగరంలోని కర్నూల్ రోడ్డు పవర్ ఆఫీస్ ఎదు రు ఉన్న అక్షిత మొబైల్ షాప్‌లో శుక్రవారం తెల్లవారు జామున జరిగింది. శ్రీన గర్‌కాలనీలో నివాసం ఉంటున్న ఏ శ్రీను గత 12 ఏళ్లుగా సెల్‌ఫోన్ దుకాణం నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి 10.35కు దుకాణం మూసేశారు. శుక్రవారం ఉదయం ఆరు గంటలకు ఆయనకు దుకా ణం షట్టర్ తీసి ఉందని ఫోన్ వచ్చింది. దీంతో హడావుడిగా అక్కడకు వెళ్లి పరిశీలించగా దొంగలు చొరబడి సెల్‌ఫోన్‌లు ఎత్తుకెళ్లినట్లు గుర్తిం చారు. ఆ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయ గా ఏఎస్పీ క్రైమ్ శ్రీధర్‌రావు, తాలూకా సీఐ భక్తవత్సలరెడ్డి తన సిబ్బందితో వచ్చి పరిశీలించి కేసు నమోదు చేశారు. 86 ఖరీదైన సెల్‌ఫో న్లు, రూ.3.72 లక్షలు నగదు అపహరణకు గురైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం సొత్తు విలువ రూ.25 లక్షలు ఉంటుందని తెలిపారు.