రాజమహేంద్రవరం లోక్‌సభ స్థానం నుంచి టీడీపీ- జనసేన-బీజేపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేరు ఖరారు చేసారు. వచ్చే నెల 5వ తేదీ నుంచి ఆమె పూర్తిగా రంగంలోకి దిగనున్నట్టు సమాచారం. ఆ రోజు నుంచి రాజమహేంద్రవరంలోనే ఆమె ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.లోక్‌సభ పరిధిలోని ద్వారకా తిరుమల వేంకటేశ్వర స్వామి(చిన వెంకన్న) ఆలయంలో పూజలు చేసి ప్రచారం ప్రారంభిస్తారనే సమాచారం ఉంది. దీనిని అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.ఆమె ఎన్‌టీఆర్ కుమార్తె కావడం, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి స్వయానా సోదరి కావడంతో కూటమిలో మరింత జోష్ కనిపిస్తోంది. ఆమె తరపున పురందేశ్వరి భర్త మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు రంగంలోకి దిగారు.రాజమహేంద్రవరం షెల్టాన్ హోటల్‌లో శుక్రవారం బస చేసి జిల్లాలో తనకు ఉన్న పరిచయాలతో నాయకులు, కేడర్‌తో సమన్వయం చేసుకునే పని మొదలు పెట్టినట్టు సమాచారం. అంతే కాకుండా పాత పరిచయస్తులతోనూ మంతనాలు సాగించారు. ఆయనను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, జనసేన రాజానగరం అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ, చాంబర్ మాజీ అధ్యక్షుడు దొండపాటి సత్యంబాబు,టీడీపీ శెట్టిబలిజసాధికార సమితి రాష్ట్ర కన్వీనర్ కుడుపూడి సత్తిబాబు జిల్లాలో వివిధ ప్రాం తాల నుంచి వచ్చిన వారు మర్యాద పూర్వకంగా కలిసినట్టు సమాచారం. దీనిలో భాగంగా జిల్లాలో రాజకీయ పరిస్థితులపై ఆరా తీసినట్టు సమాచారం.రాజకీయంగా కలిసివచ్చే అంశాలు.. కలిసిరాని అంశాలపై చర్చించినట్టు తెలిసింది.
![]() |
![]() |