భారత్-అమెరికా త్రివిధ దళాలు సంయుక్తంగా కాకినాడ తీరంలో నిర్వహిస్తున్న ‘టైగర్ ట్రయంఫ్-24’ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. అమెరికాకు చెందిన యుద్ధ నౌకలతో పాటూ భారత తరఫున ఐఎన్‌ఎస్ జలస్వ, కేసరి, ఐరావత్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. యుద్ధ సమయంలో శత్రుదేశాలపై చేసే వీరోచిత పోరాటాలు, విపత్తులు, ఆపద సమయాల్లో అందించే రెస్క్యూ సేవలను ప్రదర్శించారు. సీ ఫేజ్‌లో భాగంగా కాకినాడ రూరల్ సూర్యారావుపేట నేవెల్ ఎన్‌క్లేవ్‌లో మూడు రోజుల నుంచి భారత్-అమెరికా సంయుక్త విన్యాసాలు చేపడుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భారత్ నుంచి 700 మంది, అమెరికా నుంచి 400 మంది సిబ్బంది తమ పోరాట పటిమను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఏడీఎం మార్టినెజ్ మేజర్ జనరల్ (54వ డివిజన్) అఖిలేశ్ కుమార్, నేవీ కమాండెంట్ రాజేశ్ ధన్‌ఖడ్, అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa