హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో గురువారం 5.3 తీవ్రతతో భూకంపం సంభవించడంతో ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ప్రకంపనలు వచ్చాయి. రాత్రి 9.34 గంటలకు భూకంపం వచ్చినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. చండీగఢ్‌తో పాటు పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకన్ల పాటు భూకంపం వచ్చింది.