బడుగు బలహీన వర్గాల పార్టీ అని మార్కాపురం టీడీపీ అభ్యర్థి కందుల నారాయణ రెడ్డి అన్నారు. తర్లుపాడులోని నాయుడుపల్లె కాలనీ, బీసీ కాలనీలో ఇంటింటికి తిరుగుతూ సూపర్‌సిక్స్ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.... రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీని అధికా రంలోకి తెచ్చేందుకు ప్రతి ఒక్కరూ శాయ శక్తుల కృషి చేయాలని కోరారు. టీడీపీతోనే బడుగు, బలహీన వర్గాలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారి అభ్యున్నతికి పాటు పడింద న్నారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా కందుల నారాయణరెడ్డి, ఎంపీగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ పి.ఏసు దాసు, మండల అధ్యక్షుడు ఉడు ముల చిన్నపురెడ్డి, పి.గోపినాథ్ చౌదరి, టీడీపీ నాయకు లు జి.సుబ్బయ్య, ఈర్ల వెంకటయ్య, కాళంగి శ్రీనివాసులు, ఖైరూ, జి.వెంకటేశ్వర్లు, ఈర్ల పెద్ద కాశయ్య, పలువురు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.