రాష్ట్ర భవిష్యత్తు కోసం దూరదృష్టితో ఆలోచించి పరిపాలన చేసిన నాయకుడు చంద్రబాబు అయితే, దుష్టబుద్ధితో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సర్వనాశనం చేసిన వ్యక్తి జగన్‌రెడ్డి అని కనిగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముక్కు ఉగ్రనరసింహారెడ్డి విమర్శించారు. పామూరు గ్రామ పంచాయతీ 7వ వార్డు మెంబర్ పిడుగు శ్రీనివాసులు, ఆకుల వీధికి చెందిన వాయినేని రాఘవల ఆధ్వర్యంలో పలువురు కాపు సంఘానికి వారు ఉగ్ర సమక్షంలో టీడీపీలో చేరారు. పామూరులోని అనిల్ గార్డెన్ ఫంక్షన్‌హాల్‌లో మాజీ సర్పంచ్ డీవీ మనోహార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారందరికీ పార్టీ కండువాలతో ఉగ్ర స్వాగతం పలికారు. పార్టీలో చేరిన వారిలో మాజీ వార్డు మెంబర్ బొమ్మిశెట్టి నాగరాజు, అడ్వకేట్ రామసుబ్బారెడ్డి, పగడాల మాలి, వల్లంశెట్టి సుధాకర్, గద్దె రమేష్, వాయునేని మల్లికార్జున, షేక్ చాంద్‌బాషా, గా జులపల్లి సుబ్బయ్య ఉన్నారు.