ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి ఏపీ న్యాయ యాత్ర కొనసాగుతోంది. కడప జిల్లాలోని బద్దేల్ నియోజకవర్గం కలసపాడు మండలం మీదుగా షర్మిల న్యాయ యాత్ర సాగుతోంది. ఈ సందర్భంగా ఏపీసీసీ చీఫ్ మాట్లాడుతూ.. అధికారం ఇస్తే జగన్ అన్న హత్యా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. సొంత బాబాయిని హత్య చేసిన నిందితులను పక్కన పెట్టుకున్నారని.. మళ్ళీ వాళ్ళకే ఎంపీ సీట్ ఇచ్చారని మండిపడ్డారు. జగన్ హంతకుడిని కాపాడుతున్నారని ఆరోపించారు. అవినాష్ దోషి అని తెలిసినా చర్యలు లేని.. - నిందితులు దర్జాగా బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.