వలంటీర్లకు తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదని, వారు చేసే రాజకీయాలను మాత్రమే టీడీపీ వ్యతిరేకిస్తోందని నియోజకవర్గ దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి చెప్పారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరు సమావేశంలో ఆమె మాట్లాడుతూ .... తొలుత అన్న ఎన్టీఆర్ రూ.35లతో పింఛను పథకాన్ని ప్రవేశ పెట్టగా టీడీపీ అధినేత చంద్రబాబు రూ.2 వేలకు పెంచిన విషయాన్ని వైసీపీ నేతలు మరువొద్దని చెప్పారు. వచ్చే ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడ్డాక 4 వేల రూపాయల చొప్పున పింఛన్ ఇంటికి వెళ్ళి అందించనున్నట్లు తెలిపారు. వైసీపీ చేస్తున్న కుట్రలను కుతంత్రాలను ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికలలో వారికి తగిన గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.