విశాఖపట్టణం లోక్ సభ పరిధిలో కూటమి అభ్యర్థులు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సమావేశం అయ్యారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కార్యాచరణపై చర్చించారు. విశాఖలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకి వర్తించే విధంగా ఎజెండా రూపొందించామని ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ తెలిపారు. పొత్తుకు ఓటేద్దాం విశాఖని గెలిపిద్దాం అనే పోస్టర్ విడుదల చేశారు. పొత్తు గెలవాలి.. పాలన మారాలి అనేది తమ నినాదం అని వివరించారు. గత ఐదేళ్ల నుంచి రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగిందని పేర్కొన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, విష్ణుకుమార్ రాజు పాల్గొన్నారు.