ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి ఆరోగ్య శాఖ పలు సూచనలు, సలహాలను విడుదల చేసింది. ప్రజలు ఎక్కువగా నీరు, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటి ద్రవ పదార్థాలను తీసుకోవాలని సూచించింది. లేత వర్ణం, తేలికైన, కాటన్ దుస్తులు ధరించాలి. నలుపు, మందంగా ఉండే దుస్తులు ధరించకూడదు. రోజూ కనీసం 15 గ్లాసుల నీటిని తీసుకోవాలి. పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. భోజనం మితంగా చేయాలి. ఎండ వేళ ఇంట్లోనే ఉండాలి. బయటకు వెళ్లాల్సి వస్తే గొడుగు, టోపీ వంటివి ధరించాలి. ఇంట్లో కిటికీలు తెరిచి ఉంచాలి. సూర్య కిరణాలు, వేడి గాలులు తగలకుండా జాగ్రత్త పాటించాలి. రోడ్లపై చల్లని, రంగు పానీయాలను తాగకూడదు. మాంసాహారాన్ని తగ్గించాలి. మద్యం తాగకుండా ఉండడం మేలు. ఎండవేళ శరీరంపై భారం పడే పనులకు దూరంగా దూరంగా ఉండాలి.