ఈనెల 8వ తేదీ సోమవారం రాత్రి కనగాల గ్రామంలోని బిఈడి కళాశాలలో ముస్లిం సోదరులకు రేపల్లె వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఈవూరు గణేష్ ఇఫ్తార్ విందు ఇస్తున్నట్లు డాక్టర్ గణేష్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. చెరుకుపల్లి, నగరం, నిజాంపట్నం, రేపల్లె మండలాలకు చెందిన ముస్లిం సోదరులు ఇఫ్తార్ విందుకు హాజరు కావాలని కోరారు. డాక్టర్ గణేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఇఫ్తార్ విందుకు ఎంపీ మోపిదేవి, దేవినేని హాజరవుతారన్నారు.