నంద్యాల టీడీపీ అభ్యర్థి ఎన్‌ఎమ్‌డి ఫరూక్‌కు ప్రమాదం తృటిలో తప్పింది. నంద్యాల నుంచి కర్నూలుకు కారులో వెళ్తుండగా పాన్యం మండలం తమ్మరాజుపల్లె దగ్గర ఆయన వాహనం రోడ్డుపై ఉన్న బర్రెలను ఢీకొంది. అయితే ఈ ఘటనలో కారు ఏయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ఫరూక్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటన స్థలానికి చేరుకున్న పాన్యం టీడీపీ అభ్యర్థి గౌరు చరితా రెడ్డి తదితరులు.. ఫరూక్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa