అనకాపల్లి జిల్లా కశింకోట మండలంలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టిఫిన్ చేస్తున్న వారిపై ఓ కళాశాల బస్సు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో గౌస్ (12) అనే బాలుడు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. అలాగే ఒక కారు, 4 ద్విచక్ర వాహనాలు, ఫలహారం అమ్మే వాహనం ధ్వంసమైంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa