ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ పార్టీ . పి.గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టబాబు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీకి గుడ్ బై చెప్పిన ఆయన.. నేరుగా జమ్మలమడుగు వచ్చి షర్మిలను కలిశారు. ప్రచారంలో ఉన్న ఏపీసీసీ చీఫ్ షర్మిల.. చిట్టిబాబుకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు వైసీపీని వీడగా.. ఇప్పుడు మరికొందరు ప్రజాప్రతినిధులు సైతం ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఇంకెంత మంది జంప్ అవుతారో చూడాలి.