పోలింగ్‌లోపు గుడివాడ నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అవ్వబోతుందని అన్నారు. జూన్ 4 తర్వాత గుట్కా నాని శాశ్వతంగా ఇంట్లోనే కూర్చుంటాడంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం చూపించేది ట్రైలర్ మాత్రమే అని.. అసలు సినిమాను తట్టుకోలేడని... అహంకారానికి ప్రజల మద్దతుతో గుణపాఠం చెబుతానని స్పష్టం చేశారు. త్రాగునీరు, సాగునీరు అందించలేని పనికిమాలిన ఎమ్మెల్యేను ఎందుకు సహించాలన్నారు. గుడివాడ నియోజకవర్గంలోని గ్రామాల్లో అభివృద్ధి ముచ్చకైన కనబడటం లేదని విమర్శించారు. జగన్ దుర్మార్గం ప్రజలకు అర్థమైందని, వాలంటీర్లు కూడా అర్థం చేసుకోండని.. ప్రజల పక్షాన నిలపడాలని కోరారు. కులాల మధ్య చిచ్చు పెడుతూ, ఓట్ల కోసం శవరాజకీయాలు చేసే నీచ సంస్కృతిని జగన్ వెంట తిరిగే వాళ్ళే అసహ్యించుకుంటున్నారని అన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు, నేతలతో పాటు ప్రజాప్రతినిధులు కూడా రావడం శుభపరిణామమన్నారు. గుడివాడ అభివృద్ధిలో భాగస్వామ్యం అవుదామని పార్టీలో చేరిన వారందరికీ తప్పకుండా తగిన గుర్తింపు ఇస్తామని హామీ ఇచ్చారు. ఏడాదిలో మూడు రోజులు దృష్టి పెడితే ప్రజల త్రాగునీటి, సాగునీటి సమస్యలు పరిష్కరించవచ్చని... ఆ తీరిక ఎమ్మెల్యేకు లేదని మండిపడ్డారు. వరదలకు పంటలు మునిగి రైతులు నష్టపోతే, తాపీగా వచ్చి ఫోటోలకు ఫోజులిస్తూ ఒక్క ఎకరా కూడా మునాగలేదంటూ ఇదే గ్రామంలో రైతులను అవమానిచ్చారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఇదే విధంగా ప్రజలతో కలిసే ప్రయాణిస్తానని స్పష్టం చేశారు. ఆదాయాన్ని పెంచి ప్రజల మంచి కోసం ఖర్చుపెట్టిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు అని అన్నారు. జగన్ & కో చేసిన విధ్వంసం, అప్పులకు రాష్ట్రం వెంటిలేటర్‌పై ఉందని... కొన ఊపిరిపై ఉన్న రాష్ట్రాన్ని చంద్రబాబు నాయకత్వం ఆక్సిజన్‌లా బతికిస్తుందని వెనిగండ్ల రాము పేర్కొన్నారు.