ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ పొత్తులు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తుడంటంతో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గెలుపు వ్యూహాలపై పదును పెట్టారు. ఇందులో భాగంగానే బాపట్ల పార్లమెంట్‌లోని అసెంబ్లీ అభ్యర్థులతో చంద్రబాబు ముఖాముఖి నిర్వహించారు. ఈ సమావేశానికి కూటమి నేతలు కూడా హాజరయ్యారు. మొదట రేపల్లె నియోజకవర్గం నేతలతో చంద్రబాబు ప్రత్యేక సమావేశం అయ్యారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. ఈ సమావేశంలో ఎన్నికలకు సంబంధించి పలు కీలక అంశాలపై చర్చించారు. అభ్యర్థుల బలాబలాలపై బేరీజు వేసుకుంటున్నారు. అధికార వైసీపీని ఎన్నికల్లో ఎలా ఢీకొట్టాలనే అంశంపై కూటమి నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇంటింటికీ నేతలు ప్రచారం చేయాలని సూచించారు.