రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ గారిపై దాడి జరిగి ఆయన నుదిటికి బలమైన గాయం తగిలితే.. ఇది ఎన్నికలకు ముందు డ్రామాలు అని చంద్రబాబు, లోకేశ్, పవన్‌కళ్యాణ్‌లు అంటున్నారు. పోయినసారి ఎన్నికల ముందు కోడికత్తితో డ్రామా ఆడి సింపతీ కోసం చేశాని చెబుతున్నారు. ఇవాళ కూడా తనమీద తానే రాయి వేసుకున్నారని పవన్ కళ్యాణ్‌లాంటోళ్లు అంటున్నారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. అయన మాట్లాడుతూ..... ప్రజలంతా జగన్ గారిని ఎప్పట్నుంచో చూస్తూనే ఉన్నారు. ఆయన ఏనాడైనా సింపతీ కోసం రాజకీయం నడిపిన సందర్భం ఉందా..? అసలు, సింపతీ పొందాల్సిన పరిస్థితి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉందా..? ప్రజా బలమున్నటువంటి రాజకీయ పార్టీ మా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ. భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్లో కెల్లా అత్యంత ప్రజాదరణ, ప్రజాబలం ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. అలాంటప్పుడు ఆయనకు సింపతీ అవసరమేంటి..? మాకున్న ఓట్లు మాకేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి 175 స్థానాల్లో గెలుస్తామనే ప్రగాఢమైన విశ్వాసం మాకుంది. అయితే, జగన్ గారి మీద ఎందుకంత కక్షబట్టారు..? ఎందుకని, ఏదో అఘాయిత్యం చేయాలనుకుంటున్నారు..? అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అని అన్నారు.