వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ఇప్పటిలాగే విద్య, వైద్యరంగానికి సీఎం వైయస్ జగన్ పెద్దపీట వేస్తారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు నియోజకవర్గ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ పేర్కొన్నారు. కర్నూలు మండలం దిన్నదేవరపాడు గ్రామంలోని టిజివి కాలనీ, శిల్ప నగర్ లలో డాక్టర్ సతీష్ ఇంటింటికి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభ్యర్థి డా.ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. కోడుమూరు నియోజకవర్గంలో విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తానని చెప్పారు. అర్థరాత్రి అయినా వైద్యం విషయంలో తనను నేరుగా కలవవచ్చని, లేదా ఫోన్ ద్వారా తెలుపవచ్చని ఫోన్ నెంబర్లను గ్రామ ప్రజలకు అందించారు.. నియోజకవర్గంలో సాగునీరు, తాగునీరు, రోడ్లు సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటానన్నారు.. మళ్ళీ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే వస్తుందని, ప్రజలకు మరింత మంచిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రానున్న మే13వ తేదీన జరిగే ఎలక్షన్ లో ఎమ్మెల్యేగా డా.అదిమూలవు సతీష్, ఎంపీగా బివై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.కార్యక్రమంలో వైస్ ఎంపిపి నెహేమియా, మాజీ మండల ఉపాధ్యక్షులు ఉల్చాల బి.వాసు, వినయ్ కుమార్ రెడ్డి, వంశిధర్ రెడ్డి, పెరుగు హరినాథ్ రెడ్డి, అఖిలేష్ రెడ్డి, మాజీ సర్పంచ్ బీచుపల్లి, ఎంపిటిసి హనుమంతు రెడ్డి, పి.రుద్రవరం వెంకటేష్, మాజీ ఎంపిటిసి చిన్న లక్ష్మన్న, ఉల్చాల సర్పంచ్ విద్యాసాగర్, బైరపురం కృష్ణ, భూపాల్ నగర్ వెంకటేష్, సులేమాన్ భాషా, ఖలీల్ భాషా, ఓంకార్, బొజ్జన్న, ప్రభుదాస్, దావీద్, ఫిరోజ్, హనోక్, రామరాజు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు