రూ.10 వేలు లంచం తీసుకుంటూ మచిలీపట్నం సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్ధార్ చెన్నూరు శ్రీనివాస్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. రైస్‌మిల్లులో బియ్యం నిల్వలు అధికంగా ఉంటున్నాయని, నెలనెలా మామూళ్లు ఇవ్వాలని అవనిగడ్డ రైస్‌మిల్లు యజమాని కామిరెడ్డి వినయకుమార్‌ను సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. దీంతో మిల్లు యజమాని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. మచిలీపట్నం బైపా్‌సరోడ్డులోని పెట్రోలు బంకులో రైసుమిల్లు యజమాని రూ.10వేలు లంచం ఇస్తుండగా ఏసీబీ ఏఎస్పీ స్నేహిత ఆధ్వర్యంలో అధికారులు రైడ్ చేసి చెన్నూరు శ్రీనివా్‌సను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.