సీఎం జగన్‌పై రాళ్ల దాడి చేస్తామంటూ 1902 (హెల్ప్‌లైన్ నంబర్)కు ఫోన్ చేసిన ఐదుగురు యువకులను నగర టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని నాలుగో విశాఖ పట్టణ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. సీఎం ఆదివారం విశాఖ నగరంలో నిర్వహించిన రోడ్ షోలో ఆయనపై రాళ్ల దాడి చేస్తామంటూ పలువురు 1902 నంబర్‌కు ఫోన్ చేశారు.