శ్రీకాకుళం రూరల్ మండలంలో ఓ ఇంట్లో దొంగలు పడి 7 తులాల బంగారం చోరీకి పాల్పడ్డారు. ఎస్ఐ వాసుదేవరావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. విశాఖ-బి కాలనీలో గుడ్ల శేషగిరిరావు తన భార్యతో కలిసి ఉంటున్నారు. అయితే మూడంతస్తుల బిల్డింగ్‌లో మొదటి అంతస్తు అద్దెకు ఇచ్చి ప్రతీరోజు రాత్రి సమయంలో పెంట్‌హౌస్‌లో నిద్రిస్తుండేవారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా వివాహమై అమెరికాలో ఉంటున్నారు. శనివారం రాత్రి కూడా శేషగిరిరావు అతని భార్య పెంట్‌హౌస్‌లో నిద్రించగా కింద ఇంట్లో దొంగలు చొరబడ్డారు. బీరువాపై ఉన్న తాళాలతో సులువుగా బీరువా తెరిచి లాకర్‌పై ఉన్న తాళాల సాయంతో లాకర్ తెరిచి అందులో ఉన్న 7 తులాల బంగారం చోరీ చేసి పరారయ్యారు. ఆదివారం ఉదయం ఎప్పటిలాగే శేషగిరిరావు కింద ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు తెరిచి ఉండడంతో దొంగతనం జరిగిందని తెలుసుకుని రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. శ్రీకాకుళం సీఐ ఎల్.సన్యాశినాయుడు, ఎస్ఐ వాసుదేవరావు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేక రించారు. ఎస్ఐ కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.